మనకి తెలియని బ్యాంకింగ్ రూల్స్
ఈ బ్యాంకింగ్ యొక్క 2 రూల్స్ అనేవి తెలుసుకుందాం.
సూచిక:
- Mortgage Loan పెనాల్టీ
- ATM పెనాల్టీ
1. Mortgage Loan పెనాల్టీ :
Mortgage Loan అంటే, బ్యాంకు మన ఆస్తిని సెక్యూరిటీ గా పెట్టుకుని దాని ఆధారముగా లోన్ ఇస్తుంది. దీనినే Mortgage Loan అని అంటాము. మన ప్రాపర్టీ అనగా మన స్థలం గాని, ఇల్లు గాని ఏదైనా గాని తనఖా గా పెట్టుకొని దాని విలువ ఎంత అయితే ఉందొ దానిలో 90 % లేదా 80 % వరకు మనకి లోన్స్ ఇస్తాయి. ఒకవేళ మనము తీసుకున్న లోన్ అనేది పూర్తిగా చెల్లించేస్తే మన పత్రాలు అనేవి తిరిగి మనకి ఇవ్వాల్సిందే. ఇలా మనము పూర్తిగా లోన్ అనేది చెల్లిస్తే, RBI (రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా) రూల్స్ ప్రకారం లోన్ చెల్లించిన 30 రోజుల లోపు మనకి ఇవ్వాల్సిందే. ఒకవేళ అలా ఇవ్వకపోతే రోజుకు 5000 /- మీకు బ్యాంకు పెనాల్టీ చెల్లించాలి. ఇది ఒక Mortgage Loan ఒక్కటే కాదు. మీరు హోమ్ లోన్ తీసుకున్న కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మీరు హోమ్ లోన్ పూర్తిగా కట్టేశారు అలాంటపుడు, మీరు ఏ పత్రాలు పెట్టి హోమ్ లోన్ తీసుకున్నారో, అది సేల్ డీడ్ గాని టైటిల్ డీడ్ పత్రాలు NOC (No Objection Certificate )తో పాటు మనకి ఇవ్వలసిందే. ఒకవేళ ఇవ్వకపోతే రోజుకు 5000 /- చొప్పున బ్యాంకు మనకి పెనాల్టీ చెల్లించాలి.
ఉదాహరణ :
మీరు లోన్ పూర్తిగా చెల్లించిన 3 నెలల తరువాత మీ యొక్క పత్రాలు తిరిగి ఇచ్చింది అని అనుకుందాం. RBI (రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా) రూల్స్ ప్రకారం లోన్ చెల్లించిన 30 రోజుల లోపు మనకి ఇవ్వాలి. అంటే 30 రోజులు గ్రేస్ పీరియడ్ తీసేయగా మిగిలిన 60 రోజులకి, రోజుకు 5000 /- చొప్పున మొత్తం 3 లక్షలు మనకి బ్యాంకు పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ బ్యాంకులో మన పత్రాలు పోతే, బ్యాంకు వాళ్ళే మనకి డూప్లికేట్ పత్రాలు తయారు చేసి మనకి ఇవ్వాలి.
2. ATM పెనాల్టీ :
మీరు
చాలా సార్లు ఎటిఎం ( Automated Teller
Machine ) కి వెళ్లి డబ్బులు తీస్తూ ఉంటాం. ఒక్కొక్క సారి డబ్బులు తీసుతున్నపుడు మీ యొక్క బ్యాంకు
ఖాతా లో డబ్బులు డెబిట్
అవుతుంది మరియు మీ మొబైల్ కు
మెసేజ్ కూడా వస్తుంది గాని, ఎటిఎం ( Automated Teller
Machine ) డబ్బు రాదు. ఇలాంటప్పుడు ఆర్ బి ఐ రూల్స్
ప్రకారం మీరు
బ్యాంకుకు వెళ్లి పిర్యాదు చేసిన 5 రోజుల లోపు మీ యొక్క డబ్బుని
మీ ఖాతాలో వేయాల్సిందే. ఒకవేళ 5 రోజుల
లోపు మీ డబ్బుని వేయకపోతే
రోజుకు 100 /- చోప్ప్పున మీకు పెనాల్టీ చెల్లించాలి. ఒకవేళ బ్యాంకు ఈ పెనాల్టీ ఇవ్వను
అని అంటే, వెంటనే మీరు RBI (రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా) సైట్
కి వెళ్లి అక్కడ Banking Ombudsman మీద క్లిక్ చేసి ఆ
బ్యాంకు మీద పిర్యాదు చేయవచ్చు. ఇలా చేస్తే మీకు రావాల్సిన పెనాల్టీ ని మీ యొక్క
ఖాతాలో బ్యాంకు వేస్తుంది.
ఉదాహరణ :
మీరు
3000 /- తీయడానికి ఎటిఎం ( Automated Teller
Machine ) కి వెళ్లి డబ్బులు ఎంటర్ చేశారు గాని డబ్బులు రాలేదు అలానే బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. ఇలా చేసిన 30 రోజుల తరువాత మీ యొక్క డబ్బుని
మీ ఖాతాలో వేశారు. కానీ ముందు
మనము మాట్లాడుకున్నట్లు ఆర్ బి ఐ రూల్స్
ప్రకారం మీరు
బ్యాంకుకు వెళ్లి పిర్యాదు చేసిన 5 రోజుల లోపు మీ యొక్క డబ్బుని
మీ ఖాతాలో వేయాలి కానీ 30 రోజుల తరువాత వేశారు. దీనిలో 5 రోజులు గ్యాస్ పీరియడ్ తీసేయగా మిగిలిన 25 రోజులకుగాను 2500 /- మనకి పెనాలిటీ చెల్లించాలి. అంటే, 3000 /- మరియు 2500 /- కలిపి మొత్తం 5500 /- మనకి చెల్లించాలి.
Comments
Post a Comment