New Rules from TRAI (Telecom Regulatory Authority of India) - 2025 - ట్రాయ్ యొక్క కొత్త నియమాలు ఏమిటి ?

సిమ్ కార్డు వాడుతున్న వారికి ఒక మంచి మాట చెప్పిన ప్రభుత్వం..!! అది ఏమిటంటే?

ట్రై (టెలికాం రేగులటరీ అథారిటీ అఫ్ ఇండియా) వారు ఇటీవలే ఒక శుభవార్త తెలిపారు. రాబోతున్న రోజులలో ఇవి అమలులోకి రాబోతున్నాయి. 

సూచిక :-

1. సిమ్ కార్డు డ్ యాక్టీవ్షన్ (Activation) గడువు పెంపు
2. రీచార్జి ప్లన్స్ యొక్క రోజులు పెంపు
3. సిమ్ కార్డు రెన్యువల్ పై రీచార్జి తగ్గింపు 

1. సిమ్ కార్డు డ్ యాక్టీవ్షన్ (Activation) గడువు పెంపు:

         ఇన్ని రోజులు మనము వాడుతున్న సిమ్ కార్డుకు 90 రోజుల వరకు ఎటువంటి రీఛార్జ్ చేయకపోతే ఆ సిమ్ కార్డు డి ఆక్టివేట్ అయిపోయేది. ఆలా డి ఆక్టివేట్ అయిన సిమ్ కార్డును వేరేవాళ్లకి ఇచ్చేసేవారు. ఈ గడువు అనేది 90 రోజులు మరియు 105 రోజులు అని ఉండేవి. ఈ గడువు అనేది ఆయా కంపెనీల మీద ఆధారపడి ఉంటాయి.  అయితే ఈ గడువును ట్రై (టెలికాం రేగులటరీ అథారిటీ అఫ్ ఇండియా) వారు పెంచబోతున్నారు. ఎలా అంటే ఈ

90 రోజులు మరియు 105 రోజులు ఉన్న గడువును 180 రోజులకి పెంచబోతోంది. 

2. రీచార్జి ప్లన్స్ యొక్క రోజులు పెంపు :

          ఇన్ని రోజులు రీచార్జి ప్లాన్స్ అనేవి 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు అని ఉండేవి. కానీ రానున్న రోజులలో ఇలా ఉండవు. ఎలా ఉంటాయంటే 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, 180 రోజులు మరియు 365 రోజులు ఈ విధంగా రాబోతున్నాయి. 

3. సిమ్ కార్డు రెన్యువల్ పై రీచార్జి తగ్గింపు:

         మనలో ప్రతి ఒక్కరు రెండేసి సిమ్స్ వాడుతుంటారు. ఒకటి పర్సనల్ కోసం మరియు మరొకటి బ్యాక్ అప్ కోసం వాడుతుంటారు. కానీ మనము ఎప్పుడు మన పర్సనల్ సిమ్ కు మాత్రమే రీఛార్జ్ చేసుకుంటాము కానీ మన బ్యాక్ అప్ సిమ్ కు రీఛార్జ్ చేసుకోము. కారణము ఏమిటంటే మనము తరచుగా వాడని సిమ్ కు రీఛార్జ్ చేయించాలంటే మినిమం 200 /- రూపాయలకు పైగా రీఛార్జ్ చేయాలి. దీనిని గ్రహించిన ప్రభుత్వం ఈ రీఛార్జ్ ధరను 20 /- రూపాయలకు తగ్గించబోతోంది. దీని వల్ల మనకు చాలా డబ్బుని ఆదా చేసుకోవచ్చు. 

గమనిక : పైన తెలిపినవి ఇంకా అమలులోకి రాలేదు. రాబోతున్న రోజులలో ఎప్పటి నుండి ఇది అమలులోకి వస్తుందో మీకు తెలియజేస్తాను.


 తరచుగా అడిగిన ప్రశ్నలు :

 1. ప్రశ్న: SIM కార్డ్ రీఛార్జ్ కోసం TRAI (టెలికాం రేగులటరీ అథారిటీ అఫ్ ఇండియా) నియమాలు ఏమిటి?

జవాబు: మనము 90 రోజుల పాటు మన SIM కార్డ్‌ని (కాల్‌లు, మెసేజులు, డేటా లేదా ఇతర సేవలు) ఉపయోగించకుంటే, అది డియాక్టివేట్ చేయబడుతుంది. అయితే, 90 రోజుల డియాక్టివేట్ అయిన తర్వాత మీ ఖాతాలో రూ. 20 కంటే ఎక్కువ ఉంటే, రూ. 20 ఆటోమేటిక్‌గా తీసివేయబడుతుంది మరియు మీ SIM కార్డ్ మరో 30 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంటుంది. 

2. ప్రశ్న: TRAI వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

జవాబు: TRAI (టెలికాం రేగులటరీ అథారిటీ అఫ్ ఇండియా) వలన వివిధ టెలికాం సేవల్లోని వివిధ సమస్యలను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి వినియోగదారులు మరియు సర్వీస్ ప్రొవైడర్‌లను సులభం చేస్తుంది.

3. TRAI యొక్క కొత్త నియమాలు ఏమిటి?

TRAI డిసెంబర్ 2024లో టెలికాం వాడుతున్న వారి కోసం కొత్త నిబంధనలను ప్రారంభించింది, ఇది 2G వినియోగదారుల కోసం ఆర్థిక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావడానికి టెలికాం కం పెనీలను నిర్దేశిస్తుంది. దేశంలోని 15 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఒకే రీఛార్జ్‌తో ఏడాది పొడవునా కనెక్ట్ అయి ఉండేందుకు ఈ కొత్త నిబంధన సహాయం చేస్తుంది. 

4. రీఛార్జ్ కోసం కొత్త TRAI నియమాలు ఏమిటి?

TRAI యొక్క కొత్త 2025 నియమాల ప్రకారం ఇప్పుడు ₹20 మరియు 180 రోజుల చెల్లుబాటుతో అత్యంత సరసమైన రీఛార్జ్‌లను అనుమతిస్తాయి. Jio, Airtel, Vi మరియు BSNL కస్టమర్‌ల కోసం ఈ ఆధ్భూతమైన అప్‌డేట్‌ల గురించి మనకు ఇంకా పూర్తి సమాచారం రానుంది. 

5. TRAI సెక్షన్ 14 అంటే ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా, టెలికాం వివాదాల పరిష్కారం మరియు అప్పీలేట్ ట్రిబ్యునల్ అని పిలవబడే అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది- (a)ఏదైనా వివాదాన్ని పరిష్కరించేందుకు-

(i)లైసెన్సర్ మరియు లైసెన్స్‌దారు మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు

(ii) ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సేవా ప్రదాతల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు

(iii) సర్వీస్ ప్రొవైడర్ మరియు వినియోగదారుల సమూహం మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది.

6. SIM కార్డ్ కోసం కొత్త నియమాలు ఏమిటి?

భారతదేశంలో SIM కార్డ్‌ల కోసం కొత్త రూల్స్ లో తప్పనిసరిగా  ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, కఠినమైన గుర్తింపు మరియు చిరునామా రుజువు అవసరాలు మరియు ఒక వ్యక్తి కలిగి ఉండే SIM కార్డ్‌ల సంఖ్యపై పరిమితులు ఉంటాయి. మోసం మరియు ఇతర నేర కార్యకలాపాల కోసం సిమ్ కార్డ్‌లను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం మరియు ఇతరములు ఈ నియమాలలో భాగం. 

7. మీ పేరుపై మొబైల్ కనెక్షన్‌లను ఎలా తనిఖీ చేయాలి?

మీరు tafcop.dgtelecom.gov.in (Sanchar Sathi) అనే వెబ్సైటుకి వెళ్లడం ద్వారా మీ పేరు మీద ఎన్ని SIM కార్డ్‌లు జారీ అయ్యాయో చెక్ చేసుకోవచ్చు మరియు మీరు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఏవైనా మొబైల్ పరికరాలను బ్లాక్ చేయవచ్చు. మీ ఆధార్‌తో ఎన్ని మొబైల్ సిమ్ కార్డ్‌లు లింక్ అయ్యి ఉన్నాయో గుర్తించడం చాలా సులభం. 

8. అతుల్ కుమార్ చౌదరి ఎవరు?

అతుల్ కుమార్ చౌదరి 1989 బ్యాచ్‌కు చెందిన భారతీయ టెలికమ్యూనికేషన్ సర్వీస్ అధికారి. అతను ప్రస్తుతం న్యూ ఢిల్లీలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కార్యదర్శిగా పని చేస్తున్నారు మరియు టెలికాం & బ్రాడ్‌కాస్టింగ్ రంగాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారు.

           


Comments