క్రెడిట్ కార్డు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు - Reasons Why Credit Card Application Rejected - 2025 : Learn and Apply

మన దేశంలో ఎంత  మంది అయితే Credit Cardకు అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళ అందరి Applications ని బ్యాంక్ వారు రిజెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ బ్యాంకులు ఎందుకు మన Applications ను రిజెక్ట్ చేస్తున్నాయిCredit Card రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏమిటి? అనేవి ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అలానే మన Application ను అప్రూవ్ చేయడానికి కొన్ని సలహాలు కూడా తెలుసుకుందాం.

Reasons_Why_Credit_Card_Application_Rejected_Beware_of_Money
Reasons_Why_Credit_Card_Application_Rejected_Beware_of_Money


 క్రెడిట్ కార్డు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు:

1. సిబిల్ (CIBIL) or క్రెడిట్ స్కోర్ (CREDIT SCORE)

2. తక్కువ జీతం

3. డెబ్ట్ టు ఇన్కమ్ రేషియో (Debt to Income Ratioo)

4. ఉద్యోగములో నిలకడగా ఉండకపోవడం (జాబ్ ఇన్ స్టెబిలిటీ)

5. క్రెడిట్ హిస్టరీ రిపోర్ట్ (Credit History Report)

6. ఎక్కువగా  Credit Card లకు అప్లై చేయడం

1.సిబిల్ (CIBIL) or క్రెడిట్ స్కోర్ (CREDIT SCORE) :

               మన క్రెడిట్ కార్డు అనేది ఈ స్కోర్ ఆధారంగా తీసుకొని బ్యాంకు వారు మనకి క్రెడిట్ కార్డు మంజూరు చేస్తారు. ఈ క్రెడిట్ స్కోర్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండాలి. ఇలా ఉంటేనే ఏ బ్యాంకు ఐన మనకి క్రెడిట్ కార్డు ఇస్తుంది. ఒకవేళ 750 కన్నా తక్కువ ఉంటె ఏ బ్యాంకు కూడా మనకు క్రెడిట్ కార్డు ఇవ్వదు. ఎంత మందికైతే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అవతావుందో,వాళ్లలో 65 % మందికి ఈ క్రెడిట్ స్కోరే కారణం. ఈ క్రెడిట్ స్కోరును ఏ విధంగా పెంచుకోవాలి అంటే, ముందుగా మీరు ఏదైనా బ్యాంకులో Fixed Deposit చేసి దీని ఆధారంగా క్రెడిట్ కార్డు ను అడగండి. దీనినే FD against Credit కార్డు అని అంటాము. ఈ కార్డును బ్యాంకు మేనేజర్ ని అడిగితే ఇస్తారు. ఉదాహరణకి మీరు ఒక 1,౦౦౦/- Fixed Deposit చేసారు అనుకుందాం. ఈ లక్ష లో 90 % అంటే 9000 /- మనకి క్రెడిట్ లిమిట్ గా బ్యాంకు వారు మనకి ఇస్తారు. ఈ కార్డులో ప్రతి నెల 30 % అంటే 2700 /- మాత్రమే వాడండి.ఇలా వాడిన మొత్తాన్ని సకాలంలో బ్యాంకుకి చెల్లించండి. ఇలా చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇలా పెరిగిన తరువాత క్రెడిట్ కార్డు కి అప్లై చేయండి ఖచ్చితంగా క్రెడిట్ కార్డు వస్తుంది.

2. తక్కువ ఆదాయం:

               మన ఆదాయం తక్కువ ఉంటె ఏ బ్యాంకు కూడా మనకి క్రెడిట్ కార్డుని మంజూరు చేయదు. మన సిబిల్ స్కోర్ ఎంత మంచిగా ఉన్నా ఆదాయం తక్కువ ఉంటె క్రెడిట్ కార్డు ఇవ్వరు. దీనికి కనీసం 25000 /- రూపాయిలు ఆదాయం ఉండాలి. ఈ కనీస ఆదాయం అనేది ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు అయితే మన సిబిల్ స్కోర్ బాగుండి 15000 /- ఆదాయం ఉన్నా కూడా క్రెడిట్ కార్డు ని ఇస్తాయి. అంతే కాకుండా మనము క్రెడిట్ కార్డు పొందాలంటే మన వయస్సు మినిమం 20 లేదా 21 సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ అంత కన్నా తక్కువ ఉంటె అనర్హులుగా పరిగణిస్తారు. 

3. డెబ్ట్ టు ఇన్కమ్ రేషియో :

               మనకి ఈ డెబ్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది ఎక్కువ ఉంటె ఏ బ్యాంకు మనకి క్రెడిట్ కార్డు అనేది ఇవ్వదు. ఈ రేషియో అనేది ఎక్కువ ఉండి, మన సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్  మరియు మన ఆదాయం కూడా ఎక్కువగా ఉన్నా కూడా మనకి క్రెడిట్ కార్డు అనేది ఇవ్వరు. అసలు ఈ డెబ్ట్ టు ఇన్కమ్ రేషియో అంటే ఏమిటంటే? 

ఉదాహరణ: మీ నెలవారీ జీతం 30000 /- రూపాయిలు అందులో 20 వేల రూపాయలు మీ నెలవారి EMI లు కడుతున్నారని అనుకుందాం. మిగిలిన 10,000 మీ నెలసరి ఖర్చులు అనుకుందాం. ఇలాంటప్పుడు బ్యాంకు మీయొక్క క్రెడిట్ రిపోర్ట్ చేస్తుంది. అందులో క్లియర్ గా ఉంటుంది. మీ పేరు మీద ఇన్ని లోన్స్ ఉన్నాయి మీరు ప్రతి నెల ఇంత డబ్బుని కడుతున్నారు అని. అప్పుడు బ్యాంక్ అనుకుంటుంది, ఇతనికి 30 వేల జీతం వస్తుంది అందులో 20,000 రూపాయలు లోన్స్ రూపంలో కడితే, ఇప్పుడు ఇతనికి క్రెడిట్ కార్డు ఇస్తే సమయానికి చెల్లించడం అనుకొని మన క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తారు.

4. ఉద్యోగములో నిలకడగా ఉండకపోవడం (జాబ్ ఇన్ స్టెబిలిటీ) :

               జాబ్ ఇన్ స్టెబిలిటీ అంటే, మీరు ప్రతిసారి ఒకే జాబు లో నిలకడ లేకుండా వేరే వేరే జాబ్స్ చేస్తున్నారు. ముందు ఒక కంపెనీలో పని చేస్తున్నారు మీకు ఆ పని నచ్చలేదు తర్వాత వేరే జాబ్లో జాయిన్ అయ్యారు. ఇలా చేయడాన్ని జాబ్ ఇన్ స్టెబిలిటీ అంటారు. మీరు ఇలా చేస్తుంటే ఏ బ్యాంకు మీకు క్రెడిట్ కార్డు ఇవ్వదు. ఎందుకంటే, ఇది అన్ సెక్యూర్డ్ కార్డ్ అంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు మన ఎంప్లాయ్మెంట్ ని చూసి మనకు క్రెడిట్ కార్డ్ ని ఇస్తుంది. అలాంటప్పుడు మన ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోతే, ప్రతిసారి మన ఎంప్లాయిమెంట్ లో గ్యాప్స్ కనిపించిన ఏ బ్యాంకు మనకి క్రెడిట్ కార్డు ఇవ్వదు.

5. క్రెడిట్ హిస్టరీ రిపోర్ట్ :

               దీనికి అర్థం ఏంటంటే, ప్రతి బ్యాంకు మనకు కార్డు ఇచ్చే ముందు మన క్రెడిట్ రిపోర్ట్ హిస్టరీని చెక్ చేస్తుంది. ఉదాహరణకి మీరు ఒక లోన్ తీసుకున్నారు. ఆ లోన్ ను ప్రతి నెల కట్టడం మానేశారు. మీరు ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎలా కడుతున్నారు మరియు తీసుకున్న ప్రతి లోను సమయానికి కడుతున్నారా లేదా అనేది ప్రతిదీ కూడా ఆ రిపోర్టులో ఉంటుంది. దీనివల్ల బ్యాంకులో ఏమనుకుంటాయంటే, ఉన్న లోన్లు కూడా సమయానికి కట్టడం లేదు, ఒకవేళ మనం ఈ వ్యక్తికి క్రెడిట్ కార్డు ఇస్తే సమయానికి చెల్లించడం అని బ్యాంకు మన క్రెడిట్ కార్డు అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది. 

అంతే కాకుండా, మీరు గతంలో ఎప్పుడో లోన్ తీసుకున్నారు. ఇలా తీసుకున్న లోన్ ని మధ్యలో సెటిల్మెంట్ చేశారు. ఇలా మధ్యలో సెటిల్మెంట్ చేసినా కూడా మీకు క్రెడిట్ కార్డు ఇవ్వరు.

6. ఎక్కువగా క్రెడిట్ కార్డులకు అప్లై చేయడం :

               మీరు ఒకేసారి ప్రతి బ్యాంకు లోని క్రెడిట్ కార్డు కి అప్లై అనుకోండి. మీరు ఎన్ని సార్లు అప్లై చేశారు అనేది ప్రతి బ్యాంకు కి తెలుస్తుంది. ఇలా చేస్తే మీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే, ఈ వ్యక్తి ఒకేసారి ఇన్ని బ్యాంకులు కి క్రెడిట్ కార్డు కోసం అప్లై చేశాడంటే ఏదో కంగారులో ఉన్నాడు. ఇలాంటి సమయంలో మనం గాని క్రెడిట్ కార్డు ఇస్తే , మొత్తం వాడేసి మన క్రెడిట్ కార్డ్ బిల్లును సమయంలో తీర్చాడేమో అని మన అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. ఇలాంటి తప్పు మీరు ఎప్పుడు చేయకండి. 

నేను పైన చెప్పినవన్నీ కూడా పాటించి మీయొక్క క్రెడిట్ స్కోర్ ని పెంచుకుంటే మీరు ఏ బ్యాంకు కి క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన మనకి అప్రూవ్ చేస్తారు.







Comments