Why Does a Pincode Always have 6 Digits? - Do you know Meaning of It. - What is Pincode? - Which Digit represents what in pin code.

Why Does Pincode Always have 6 Digits? 

అసలు పిన్ కోడ్ లో 6 అంకెలే ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మన బ్లాగులో వీటి గురించి మన భాషలో తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ అనేది కమ్యూనికేషన్, వాణిజ్యం మరియు కనెక్టివిటీని సులభతరం చేసే ఒక ముఖ్యమైన సంస్థ. ఇది ఉత్తరాలు, పొట్లాలు మరియు ప్యాకేజీలను పంపడం మరియు స్వీకరించడం కోసం కేంద్రంగా పనిచేస్తుంది, వ్యక్తులు మరియు వ్యాపారాలు స్థానిక, జాతీయ మరియు అంతర్జాతీయ సరిహద్దుల్లో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. శతాబ్దాల క్రితం స్థాపించబడిన, పోస్ట్ ఆఫీస్ మెయిల్ డెలివరీ, డబ్బు బదిలీలు, బిల్లు చెల్లింపులు మరియు ప్రభుత్వ సంబంధిత లావాదేవీలతో సహా విభిన్న సేవలను అందించడానికి సాంకేతిక పురోగతితో అభివృద్ధి చెందింది.

కమ్యూనిటీలకు మూలస్తంభం, తపాలా కార్యాలయం గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కీలకమైన పాత్ర పోషిస్తుంది, అవసరమైన సేవలకు ప్రాప్యతను నిర్ధారిస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాలను కూడా విస్తృత ప్రపంచానికి కనెక్ట్ చేయడం ద్వారా చేరికను ప్రోత్సహిస్తుంది. శాఖలు మరియు పోస్టల్ ఉద్యోగుల యొక్క బలమైన నెట్‌వర్క్‌తో, ఇది విశ్వసనీయమైన మరియు సరసమైన సేవలను అందిస్తుంది, ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇస్తుంది మరియు సామాజిక సంబంధాలను పెంపొందిస్తుంది.

ఆధునిక తపాలా కార్యాలయాలు డిజిటల్ పరివర్తనను స్వీకరించాయి, ఆన్‌లైన్ ట్రాకింగ్, ఇ-కామర్స్ లాజిస్టిక్స్ మరియు డిజిటల్ కమ్యూనికేషన్ సేవలను అందిస్తున్నాయి. ప్రైవేట్ కొరియర్‌లు మరియు డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా సవాళ్లు ఎదురైనప్పటికీ, పోస్టాఫీసు దాని విశ్వసనీయత, విస్తృతమైన పరిధి మరియు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యం కారణంగా సంబంధితంగా ఉంటుంది.

సూచిక:

1. పిన్ కోడ్ అంటే ఏమిటి మరియు ఎప్పుడు మొదలయింది?
2. పిన్ కోడ్ లో ఏ అంకె దేనిని సూచిస్తుంది?



1. పిన్ కోడ్ అంటే ఏమిటి మరియు ఎప్పుడు మొదలయింది?

          పిన్ కోడ్ అంటే పోస్ట్ ఆఫీసులో ఉపయోగించే 6 అంకెల గల సంఖ్య. మన ఇండియా లో స్వాతంత్రం సమయములో కూడా ఈ పిన్ కోడ్ విధానం లేదు. దీన్ని ఆగష్టు 15 , 1972 లో మొదలయింది. ఈ పిన్ కోడ్ ను పోస్టల్ ఇండెక్స్ నెంబర్ (Postal Index number) అని కూడా అంటారు.

2. పిన్ కోడ్ లో ఏ అంకె దేనిని సూచిస్తుంది?



      I) ఈ పిన్ కోడ్ లో మొదటి నెంబర్ జోన్ ను సూచిస్తుంది. అంటే

  •  నార్త్  జోన్
  • వెస్ట్  జోన్
  •  సౌత్  జోన్
  • ఈస్ట్  జోన్ ని సూచిస్తుంది.

North Zone (నార్త్ జోన్) : 

ఈ జోన్ లో అన్ని పిన్ కోడ్ లు 1 లేదా 2 నెంబర్ తో మొదలవుతుంది.
ఉదాహరణకు: హర్యానా 1వ నెంబెర్ తోను  మరియు ఉత్తర్ ప్రదేశ్  రాష్ట్రాల్లో పిన్ కోడులు 2వ నెంబర్ తో మొదలవుతుంది.



West  Zone (వెస్ట్ జోన్) : 

ఈ జోన్ లో అన్ని పిన్ కోడ్ లు 3 లేదా 4 నెంబర్ తో మొదలవుతుంది.

ఉదాహరణకు: రాజస్థాన్ లొ 3వ నెంబెర్ తోను  మరియు మహరాష్ట్రాల్లో పిన్ కోడులు 4 నెంబర్ తో మొదలవుతుంది.



South Zone (సౌథ్ జోన్) : 

ఈ జోన్ లో అన్ని పిన్ కోడ్ లు 5 లేదా 6 నెంబర్ తో మొదలవుతుంది.

ఉదాహరణకు: విశాఖపట్నం లొ 5వ నెంబెర్ తోను  మరియు తమిళనాడు రాష్ట్రాల్లో పిన్ కోడులు 6 నెంబర్ తో మొదలవుతుంది.



East Zone (ఈస్ట్ జోన్) : 

ఈ జోన్ లో అన్ని పిన్ కోడ్ లు 7 లేదా 8 నెంబర్ తో మొదలవుతుంది.

ఉదాహరణకు: ఒరిస్సా లొ 7వ నెంబెర్ తోను  మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో పిన్ కోడులు 8 నెంబర్ తో మొదలవుతుంది.



పిన్ కోడ్ లో మొదటి అంకె 9 అనేది ఆర్మీ పోస్టల్ సర్వీస్ కోసం ప్రత్యేకించబడ్డాయి.

       II)  ఈ పిన్ కోడ్ లో రెండవ నెంబర్ సబ్ జోన్ ను సూచిస్తుంది.

ఉదాహరణకు:

సౌత్ ఇండియా లోనీ సబ్ జోన్ లు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో మూడు సబ్ జోన్ లు ఉంటాయి. అందువలన ఆంధ్ర పిన్ కోడ్ లో రెండవ నెంబర్ 1 , 2 మరియు 3 తో మొదలవుతుంది. అలాగే తెలంగాణ లో ఎటువంటి జోన్ లు లేవు అందుకే తెలంగాణ పిన్  కోడ్ లో  రెండవ నెంబర్ 0 తో మొదలవుతుంది.

       III)ఈ పిన్ కోడ్ లో మూడవ నెంబర్ జిల్లా కోడ్ ను సూచిస్తుంది.

      IV)ఈ పిన్ కోడ్ చివరి మూడు నంబర్లు దేనిని సూచిస్తాయాంటే,

         ఆ జిల్లాలో ఉన్న వేరు వేరు పోస్ట్ ఆఫీస్ కోడ్స్ ని తెలుపుతుంది. ఆ జిల్లాలో ఎన్ని పోస్ట్ ఆఫీస్ లు ఉన్నాయో ఒక్కొక్క పోస్ట్ ఆఫీస్ కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను మన పిన్ కోడ్ లో చివరి మూడు అంకెలు సూచిస్తాయి. అందువలనే మన కొరియర్ గాని, డెలివెరీలు గాని, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డెలివరీ కూడా కరెక్ట్ గా మన దర్గరకి వచ్చేస్తాయి.


 

 


Comments