Jumped Deposit Scam
మార్కెట్లోకి కొత్త స్కాం వచ్చింది. అది ఏమిటంటే..???
సూచిక :
1. జుంప్డ్ డిపాజిట్ స్కాం అంటే ఏమిటి? దీనిని ఎలా కనిపెట్టాలి?
2. ఈ జుంప్డ్ డిపాజిట్ స్కాం నుండి ఎలా తప్పించుకోవాలి ?
1. Jumped Deposit Scam అంటే ఏమిటి? దీనిని ఎలా కనిపెట్టాలి?
ఈ స్కాములో భాగంగా, ముందుగా స్కామరు, మన మొబైల్ కి ఒక మెసేజ్ పంపుతాడు. ఏమని, "మీ బ్యాంకు ఖాతాకు ౩500/- క్రెడిట్ అయ్యాయి " అని. మనము ఆ మెసేజ్ చూసి మన బ్యాంకు ఖాతాలో డబ్బులు పడ్డాయని ఆనందపడి యూపీ అప్స్ ఓపెన్ చేసుకొని మన బాలన్స్ ని చెక్ చేసుకుంటాం. దీనినే స్కామరు అనుకూలము చెసుకొని మనము మన యూపీ అప్ ని ఓపెన్ చేసే లోపే మనకి ఎంత అయితే మన ఖాతాలో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చిందో అంత కన్న ఎక్కువ డబ్బుని మనీ రిక్వెస్ట్ కింద పంపిస్తాడు.
2. ఈ Jumped Deposit Scam నుండి ఎలా తప్పించుకోవాలి ?
ఒకవేళ మీకు ఇలాంటి మెసేజెస్ గాని
వస్తే కంగారు పడి యూపిఐ (UPI) అప్స్ ఓపెన్ చేయవద్దు. కనీసం ఒక ౩౦ నిమిషాలైనా వేచివుండండి.
ఇలా చేస్తే ౩౦ నిమిషాల తరువాత వాడు పంపిన రిక్వెస్ట్ గడువు ముగిసిపోతుంది. లేదా మీ
పిన్ నెంబర్ తప్పుగా ఎంటర్ చేసిన కూడా అది రద్దు అయిపోతుంది.
మీ ఆదాయము పోకుండా ఉండడానికి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు:
- మీ ఫోన్ యొక్క పిన్ మరియు పాస్ వర్డులు ఎవరితోనూ పంచుకోకండి.
- మీ యొక్క ఓటీపీ కూడా ఎవరితను చెప్పకండి.
- అనవసరమైన వెబ్ సైట్లలో మీ యొక్క ఎటిఎం కార్డు వివరాలు నమోదు చేయకండి.
- బయట వారు ఎవరైనా మీ ఫోన్ నుండి కాల్స్ చేసుకుంటాము అని అన్న మీరే ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇవ్వండి. లేకపోతే కాల్ ఫార్వార్డింగ్ ద్వారా కూడా మీ డబ్బు పోయే అవకాశం ఉంది.
- ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించండి.
Comments
Post a Comment