New Traffic Rules from 1st June 2024 - ప్రతీఒక్కరు ఖచితంగా తెలుసుకోవాలి - How to apply Driving License
జూన్ 1వ తేదీ నుండి క్రొత్త ట్రాఫిక్ రూల్స్ లో భారీ మార్పులు
మన భారతదేశంలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం RTOలో డ్రైవింగ్ పరీక్షలు అనేవి జూన్ 1 నుండి ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ లో కూడా లైసెన్స్ పొందవచ్చు. మన భారతదేశంలో, డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది మరియు దరఖాస్తుదారు అనేక అధికారులను కలిసి అనేక పేపర్లను జతచేయాలి. ఈరోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే సుదీర్ఘమైన మరియు కష్ట తరమైన విధానం. కానీ ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఇది చివరికి భారతదేశ రహదారి భద్రతపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈ సమస్యను ఎదుర్కోవడానికి భారతదేశంలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నియమాలు జారీ చేయబడ్డాయి. ఇంకా దీనికోసం పూతి వివరాలు కావాలంటే క్రింద ఆర్టికల్ చదవండి.
ఈ జూన్ 1 వ తేది 2024వ సంవత్సరములో ప్రవేశపెట్టిన క్రొత్త రూల్ ద్వారా మీరు ఏదైనా RTO తో లింక్ అయిన ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్లో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వవచ్చు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇస్తారు.
మీకు డ్రైవింగ్ రాకపోయినా పర్వాలేదు, మీరు ఏదైనా RTO తో లింక్ అయిన ప్రైవేట్ డ్రైవింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. వాళ్లు మీకు 29 గంటలపాటు ట్రైనింగ్ ఇస్తారు. మీకు డ్రైవింగ్ వచ్చిన తరువాత ఎక్కడైతే డ్రైవింగ్ నేర్చుకున్నారో అక్కడే డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వచ్చు. మీరు ఈ డ్రైవింగ్ టెస్టులో పాస్ అయితే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికెట్ ఇస్తారు అలాగే దానితో పాటు లెర్నింగ్ లైసెన్స్ నెంబర్ కూడా ఇస్తారు. మీకు ఈ రెండు ఇచ్చిన తరువాత లైసెన్సు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్తాను.
డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకునే ప్రక్రియ:
1. మొదటిగా గూగుల్ ఓపెన్ చేసి parivahan.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
2. తరువాత Drivers/Learner License మీద క్లిక్ చేయాండి.
3. చేసిన తరువాత చాలా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. దానిలో Apply for Driving License మీద క్లిక్ చేయండి.
4. డ్రైవింగ్ లైసెన్సుకు కావాల్సిన పత్రాలు, ఫోటో మరియు సంతకం మరియు సంబంధిత పత్రాలు అన్ని చదివాక Continue మీద క్లిక్ చేయండి.
5. Learner License Number, Date of Birth మరియు Captcha ఎంటర్ చేసి OK మీద క్లిక్ చేయండి.
6. తరువాత అప్లికేషన్ ఫారం ఫిల్ చేసి, ఫోటో మరియు సంతకం కూడా అప్లోడ్ చేసి 200/- రుసుము చెల్లించి అప్లికేషన్ ప్రింట్ తీసుకొని RTO ఆఫీసులో ఇస్తే మీకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వడం జరుగుతుంది.
Comments
Post a Comment