PPF Scheme - PPF Full Form - PPF Calculator and NPS Scheme - NPS Full Form - NPS calculator

DIFFERENCE BETWEEN PPF & NPS

PPF (Public Provident Fund) v/s NPS (National Pension Scheme) ఈ రెండిటిలో ఏది బెటర్? మన రిటైర్మెంట్ కోసం మన డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది? ఎక్కడ పెట్టుబడి పెడితే అతి త్వరగా ఒక కోటి రూపాయిల కార్పస్ (అసలు + వడ్డీ) అనేది పొందగలము? ఈ బ్లాగ్ లాస్ట్ వరకు చదివితే మీరు దేనిలో పెట్టుబడి పెట్టాలో ఒక అవగాహన వస్తుంది అలాగే చాల వరకు వడ్డీ కూడా ఆదా అవుతుంది. 

PPF అనగా పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ (Public Provident Fund):

ఈ ఖాతాని బ్యాంకు మరియు పోస్ట్ ఆఫీసుకు వెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. దీనిలో భాగంగా మనము మన డబ్బుని 15సంవత్సరాలు వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. మనకు కావాలంటే 15 సంవత్సరాల తరువాత అసలు+వడ్డీని తీసుకోవచ్చు లేదా ఇంకొక 5సంవత్సరాలు వరకు పెంచుకోవచ్చు. మీరు ఈ 15సంవత్సరాలు ప్రతి నెలగాని లేదా మూడు నెలలకుగాని లేదా ఆరు నెలలకుగాని లేదా సంవత్సరానికి గాని మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనిలో భాగంగా మనము ఒక సంవత్సరానికి మినిమం 500 రూపాయిలు నుండి మాక్సిమం 1,50,000 రూపాయిలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీరు ఎన్ని సార్లు కావలి అంటే అన్ని సార్లు మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అది కూడా సంవత్సరానికి 1,50,000 రూపాయిలు  మాత్రమే పెట్టుబడి పెట్టగలరు అంతకన్నా ఎక్కువ మీరు అయితే పెట్టుబడి పెట్టలేరు.


 అదే విధంగా దీనిలో మీకు Section-80C  టాక్స్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది. దీనివల్ల మీరు ఒక సంవత్సరానికి 1,50,000 రూపాయిల వరకు టాక్స్ బెనిఫిట్ పొందగలరు. ఒకవేళా ప్రమాదావశాత్తు ఏ వ్యక్తి అయితే పెట్టుబడి పెడుతున్నారో ఆ వ్యక్తి చనిపోతే, అప్పటి వరకు పెట్టుబడి పెట్టిన డబ్బు అంతా నామినీకి ఇవ్వడం జరుగుతుంది. ఈ PPF లో వడ్డీ రేట్ చూసుకుంటే ప్రస్తుతం 7.1 % ఇస్తున్నారు. ఇది ప్రభుత్వ స్కీం కాబట్టి మనము ఎంత అయితే పెట్టుబడి పెడుతున్నామో అది అంత భద్రం గానే ఉంటుంది

నేను క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు PPF Calculator ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు అయితే లెక్కించుకోవచ్చు. 

PPF Calculator

1. మనము సంవత్సరానికి 1,50,000/- వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. 

2. 15సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. 

3. 7.1 % వడ్డీ.

NPS (National Pension Scheme) నేషనల్ పెన్షన్ స్కీం:

      ఈ ఖాతాని బ్యాంకుకు వెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా ప్రభుత్వ స్కీమే కాకపోతే ఇందులో ఫండ్ మేనేజర్ ఉంటారు.  ఈ ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. దీనిలో భాగంగా మనము ఒక సంవత్సరానికి మినిమం 1000 రూపాయిలు నుండి మాక్సిమం ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనం ప్రస్తుతం జాబ్ చేస్తున్నాము (లేదా) వ్యాపారం చేస్తున్నాము దీని వలన డబ్బు వస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి 60సంవత్సరాలు వస్తే ఎలా? పదవీ విరమణ తరువాత డబ్బు ఏ విధంగా వస్తుంది? దీనికోసం మనము ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఎలా అంటే మనకి జీతం వస్తున్న సమయంలోనే కొంత డబ్బు అనేది ఈ NPS లో పెట్టుబడి పెట్టాలి. 

ఇలా చేసుకుంటే మనకి మన పదవీ విరమణ తరవాత కూడా పెన్షన్ వస్తూ ఉంటుంది. మనము ఈ 60సంవత్సరాలు పెట్టుబడి పెట్టడం వలన వచ్చిన కార్పస్ (అసలు+వడ్డీ) లో 60% డబ్బు మనకు పదవీ విరమణ తరువాత ఇచ్చేస్తారు. మిగతా 40% డబ్బుని మల్లి పెట్టుబడి పెడతారు అందులో వచ్చిన డబ్బుని ప్రతి నెల మనకు పెన్షన్ రూపంలో మన ఖాతాలో పడుతూ ఉంటుంది. ఇలా పెట్టుబడి పెట్టిన 40% డబ్బు '0' సున్నా అయ్యే  వరకు మన ఖాతాలో వేయడం  జరుగుతుంది. దీనిలో మనకి 8% నుండి 16% వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంది. ఖత్చితంగా చెప్పిన వడ్డీ అయితే వస్తుంది అన్న నమ్మకం లేదు ఎందుకంటే ఇది పూర్తిగా మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. 

సాధారణంగా దీనిలో 4 అస్సెట్ క్లాసులు ఉంటాయి, అవి ఏమిటంటె 

1. అస్సెట్ క్లాస్ (E) - ఈక్విటీ:

             ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్. ఈ ఈక్విటీ లో మన డబ్బుని 75% వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎలా అంటే మనము ఈ NPS (National Pension Scheme) ఖాతా తెరిచే సమయంలోనే మనము ఫండ్ మేనేజర్ కి చెప్పాలి 60సంవత్సరాల తరువాత నా కార్పస్ (అసలు+వడ్డీ)లో 75% ఈక్విటీ లో పెట్టుబడి పెట్టమని చెప్తే ఆ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతారు. దీనిలో పెట్టుబడి పెడితే 14% వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంది. 

2. అస్సెట్ క్లాస్ (G) - గవర్నమెంట్ సెక్యూరిటీస్:

                  నాకు ఎటువంటి రిస్క్ అవసరం లేదు అలాగే నాకు వడ్డీ తక్కువ వచ్చిన పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నందు 100% పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ వడ్డీ మాత్రం 8%, 9% ఆలా వస్తుంది. 

3. అస్సెట్ క్లాస్ (C) - కార్పొరేట్ డెబ్ట్:

                దీనిలో ఫండ్ మేనేజర్ మన డబ్బుని కార్పొరేట్ బాండ్స్,కార్పొరేట్ సెక్యూరిటీస్ etc. లో 100% పెట్టుబడి పెట్టుకోవచ్చు. 

4. అస్సెట్ క్లాస్ (A) - ఆల్టర్నేటివ్ ఇన్వెస్టుమెంట్స్:

           దీనిలో ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఆల్టర్నేటివ్ ఇన్వెస్టుమెంట్స్ నందు 5% వరకు పెట్టుబడి పెడతారు. 

నేను క్రింద ఇవ్వబడిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు NPS Calculator ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు అయితే లెక్కించుకోవచ్చు. 

NPS Calculator

1. మనము సంవత్సరానికి ఎంతైనా  పెట్టుబడి పెట్టుకోవచ్చు. 

2. 60సంవత్సరాలు వచ్చినంత వరకుపెట్టుబడి పెట్టాలి. 

3. వడ్డీ మాత్రం మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది.


Comments