How to Save Money - How to Save Money from Salary - Investment Plans - Passive Income Tips - Active Income Tips - Save Money
How to Save Money
"Salary Savings" ఏమిటి శాలరీ సేవింగ్స్ హా...? నేను చాలా మందిని అడుగుతున్న, నీకు వచ్చే ఆదాయం ఎంత? మీకు వచ్చే జీతంలో ఎంత వరకు సేవింగ్స్ చేస్తున్నారు? సేవింగ్స్ చేసే డబ్బుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెడుతున్నారు?
చాలా మంది ఏమి చెపుతున్నారు అంటే, ఎక్కడండీ సేవింగ్స్ ? ప్రస్తుతం ఖర్చలు చాలా పెరిగిపోయాయి. ఒక్క రూపాయి అయిన ఆదా చేద్దాం అంటే అవ్వడం లేదు. ఇప్పుడు వచ్చిన శాలరీ నా పిల్లలకు మరియు నా కుటుంబ అవసరాలకే సరిపోతుంది. నా పరిస్థితీ ఇలా ఉంటే ఎలా సేవింగ్స్ చేయాలి అని అంటున్నారు.
అందుకే కదా నేను ఉన్నది. ఈరోజు మీకు వచ్చిన జీతంలోనే ఎలా సేవింగ్స్ చేయాలో నీకు చెప్తాను. ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది.
మనకు ఇన్కమ్ (డబ్బు) అనేది రెండు విధాలుగా వస్తుంది:
- యాక్టీవ్ ఇన్కమ్.
- పాసివ్ ఇన్కమ్.
1. ఆక్టివ్ ఇన్కమ్:
ఈ ఆక్టివ్ ఇన్కమ్ అంటే మనము నెలంతా కష్టపడితే వచ్చే డబ్బుని ఆక్టివ్ ఇన్కమ్ అని అంటారు. ఇందులో మనకు ఎన్ని రోజులు అయితే పని చేస్తామో దానికి మాత్రమే మనకి డబ్బు అనేది వస్తుంది. మనము పని చేయక పోతే డబ్బు రాదు.
2. పాసివ్ ఇన్కమ్:
ఈ పాసివ్ ఇన్కమ్ అంటే మన డ్యూటీ అయిపోయిన తర్వాత మనకి ఉన్న స్కిల్స్ ని ఉపయోగించుకుంటూ అదనపు ఆదాయాన్ని పొందడాన్ని పాసివ్ ఇన్కమ్ అంటారు.
మొదటిగా మనము ఈ పాసివ్ ఇన్కమ్ పొందాలి అంటే, మీలో ఏ స్కిల్స్ ఉన్నాయో మీరు దాన్ని కనిపెట్టాలి. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది. కానీ అది ఎవరు కనిపెట్టలేరు. మీకు ఏ స్కిల్స్ రాకపోయినా మీకు ఇష్టమైన ఏదో ఒక స్కిల్ నేర్చుకొని దాని ద్వారా డబ్బు సంపాధించుకోవచ్చు. ఒకవేళ ఆలా కూడా నేర్చుకోలేను అన్న పర్వాలేదు నేను నీకు చెప్తా.
స్కిల్స్ ని ఉపయోగించుకుని డబ్బు సంపాదించడం ఎలా?
- కాపీ రైటింగ్
- వాయిస్ ఓవర్
- వీడియో ఎడిటింగ్
- కంటెంట్ రైటింగ్ మరియు ఇతరములు.
1. కాపీ రైటింగ్ :
ఈ వర్క్ లో మనకి మనకి ఒక భాషలో ఉన్న కంటెంట్ ని వేరే భాషలోకి మన ఉన్న స్కిల్స్ ని ఉపయోగించి పని చేయాలి.
ఉదాహరణకి, మనకు ఇంగ్లీష్ ఉన్న కంటెంట్ ని ఇచ్చి దానిని తెలుగు, హింది లేదా ఇతర భాషలలోకి తర్జుమా చేయాలి. ఇలా చేస్తే మనకు డబ్బు అనేది వస్తుంది. మనము ఈ వర్కుని ఎలా పొందాలి అంటే, మనము ఈ naukari, linkedin మరియు ఇతర సైట్స్ లో పెడతారు. అందులో మనము రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవాలి లేదా fiverr, freelance, upwork వంటి సైట్లలో రిజిస్టర్ అయ్యి వర్క్ ని సంపాదించుకోవాలి.
2. వాయిస్ ఓవర్:
ఈ వర్కులో మనము ఒక వీడియో కి వాయిస్ ఇవ్వాలి. మనము చాలా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ లాంటి వాటికి వాయిస్ ఓవర్ ఇస్తూ డబ్బు అనేది సంపాధింకోవచ్చు. పైన చెప్పిన సైటులలో రిజిస్టర్ అయ్యి అప్లై చేసుకోవచ్చు.
3. వీడియో ఎడిటింగ్:
మీకు ఒకవేళ వీడియో లేదా ఫోటో ఎడిటింగ్ బాగా వచ్చినట్లయితే దాన్ని ఉపయోగించుకొని ఒక వీడియోకి లేదా ఒక ఫోటోకి కొంత డబ్బు పెట్టుకొని సంపాధించుకోవచ్చు. దీనికి బెస్ట్ ఆప్షన్ fiverr, Upwork లేదా freelancer లో రిజిస్టర్ అయ్యి అందులో మీరు ముందుగా ఎడిట్ చేసిన వీడియో లేదా ఫోటో శాంపిల్ గా పెట్టి కొంత డబ్బుని ఛార్జ్ చేసి డబ్బు సంపాదించవచ్చు.
4. కంటెంట్ రైటింగ్:
దీనిలో మనము ఆన్లైన్ లో కంటెంట్ రాస్తూ లేదా రాసిన కంటెంట్ మీద వీడియోస్ చేసి డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే..??
యూట్యూబ్ లో ఫుల్ వీడియోస్ లేదా షార్ట్స్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలి. ఇలా చేస్తే మీకు వచ్చిన వ్యూస్ మరియు subscribe చేసుకుంటే మీఋ చేసిన వీడియోస్ కి మధ్యలో యాడ్స్ అనేవి వస్తాయి. ఇలా యాడ్స్ రావడం వాళ్ళ మీకు డబ్బు అనేది వస్తాయి.
ఇంస్టాగ్రామ్ ఉస్ చేసుకొని దానిలో కూడా వీడియోస్ అప్లోడ్ చేసి మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. మీరు చేసిన వీడియోస్ బాగుంటే మీకు ఫాలోవర్లు వస్తారు. అలా రావడం వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బు సంపాదించుకోవచ్చు.
స్కిల్స్ లేకపోయినా డబ్బు సంపాదించడం ఎలా?
మనకు స్కిల్స్ లేకపోయినా డబ్బు సంపాదించుకోవచ్చు. మీ డ్యూటీ అయ్యిపోయిన తరువాత రాపిడో, జొమాటో, స్విగ్గి మరియు ఇతర అప్స్ లో రిజిస్టర్ అయ్యి డబ్బు సంపాదించుకోవచ్చు. లేదా చిన్న ఫుడ్ ట్రక్ పెట్టుకోండి డబ్బు వస్తూ ఉంటుంది.
మీకు ఎక్కడ ఇల్లు గాని స్థలం గాని ఉంటె దానిని లీజ్ కి ఇవ్వండి డబ్బు వస్తుంది లేదా మీకు కార్ ఉంది దానిని మీరు ఎక్కవగా వాడడం లేదు అలాంటపుడు కారును రెంట్ కి ఇవ్వండి డబ్బు వస్తూ ఉంటుంది.
డబ్బుని ఏ విధంగా ఆదా చేయాలి?
ఇప్పుడు మీరు పైన చెప్పిన విధంగా చేసినపుడు, ఉదాహరణకు ఒక నెలకు 7000/- వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చిన డబ్బుని మనము ఎలా సేవ్ చేయాలి? ఎక్కడ సేవ్ చేయాలి? దేనిలో పెట్టుబడి పెట్టాలి? ఇలా వచ్చిన డబ్బుని వేరే సేవింగ్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయకూడదు.
ఒకవేళ మీకు ఆడపిల్ల ఉంటే.....
"సుకన్య సమృద్ధి యోజన" స్కీం లో ప్రతినెలా పెట్టుబడి పెట్టు. మీ పాపకి 10 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటె ఈ స్కీం కట్టు. మీరు ఇప్పటి నుండే మొదలు పెడితే పాప హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం గాని, పెళ్లి కోసం గాని ఎటువంటి అప్పు చేయాల్సిన పని లేదు. ఈ పధకం లో మినిమం సంవత్సరానికి 250/- నుండి 1,50,000/- వరకు మనము పెట్టుబడి పెట్టుకోవచ్చు.


.jpg)
.jpg)



Comments
Post a Comment